స్మోకింగ్‌ మానేయాలనుకుంటున్నారా..? ఈ చిట్కాలు పాటించండి..

-

Smoking: స్మోకింగ్‌ అలవాటు ఉంటే.. ఆ వ్యక్తికి ఏ చిన్న తలనొప్పి, ప్రజెర్‌ అనిపించినా.. స్మోక్‌ చేయాలనిపిస్తుంది. పొగతాగడం వల్ల.. సమస్యలు ఏం తగ్గిపోవు.
స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ చాలా మంది ఈ అలవాటును మానుకోలేరు. బానిస అయిపోతారు.. ధూమపానం మానేయడం అంత తేలికైన పని కాదు. కానీ మంచి ఆరోగ్యం కోరుకునే వారు, జీవితంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకూడదని భావించే వారు ఈ దశను తప్పక దాటాలి. మీరు పొగతాగడం మానాలి అనుకోని.. కానీ మానలేకపోతున్నారా..? కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మీరు అనుకున్నది సాధ్యం చేసుకోవచ్చు.

 

Smoking
Smoking

క్రమంగా తగ్గించాలి

ఒకేసారి ధూమపానం మానేయడానికి ప్రయత్నించవద్దు. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే, ఈ రోజు స్మోక్‌ చేయడం లేదు అని మనసులో గట్టిగా అనుకోవాలి. ధూమపానం చేయకుండా ఒక వారం, ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండే వరకు ఇలా రోజూ అనుకోవాలి. మీకు రోజుకు ఒక పెట్టే సిగిరెట్లు తాగే అలవాటు ఉంటే.. ఒకేసారి మొత్తం మానేయకండి.. అదే పెట్టె సిగిరెట్లు రెండు రోజులకు తాగండి, క్రమంగా మూడు రోజులు అలా ఒక పెట్ట సిగిరెట్లు అయిపోవడానికి టైమ్‌ను పెంచుకోండి.

మోటివేషన్‌ అవసరం

ధూమపానం ఎందుకు మానేయాలని అనుకుంటున్నారు..? అనే మోటివేషన్‌ మీకు చాలా అవసరం. ఆరోగ్యం కోసమా, డబ్బు పొదుపు కోసమా, లేదా పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండటానికా? ఇలా కారణం ఏమైనప్పటికీ, మోటివేషన్‌ తప్పకుండా ఉండాలి. మోటివేషన్‌ను ఓ పేపర్‌పై రాసి రోజూ తరచూ కనిపించే ప్లేస్‌లో అంటించాలి. ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేసుకోవాలి.

స్మోక్‌ చేయాలని మీకు ఎప్పుడు అనిపిస్తుంది?

ధూమపానం చేయాలని ఏ సమయంలో అనిపిస్తుందో మీరు గమనించాలి.. కొన్ని పరిస్థితులు లేదా కార్యకలాపాలు ధూమపానం చేయాలనుకునేలా చేస్తాయి. ఇది ఒత్తిడి, విసుగు లేదా ధూమపానం చేసే స్నేహితుల చుట్టూ ఉండటం వంటివి కావచ్చు. ఈ ట్రిగ్గర్‌లను గుర్తించడానికి ప్రయత్నించాలి. వాటిని నివారించడానికి లేదా వాటిని ఎదుర్కోవడానికి ఒక ప్లాన్‌ రూపొందించుకోవాలి.

సపోర్ట్ పొందండి

ఒంటరిగా ధూమపానం మానేయాల్సిన అవసరం లేదు. ధూమపానం మానేయాలనే నిర్ణయం గురించి కుటుంబం, స్నేహితులతో చెప్పవచ్చు. వారి సపోర్ట్‌ అడగవచ్చు. లేదంటే అదే విషయాన్ని ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వండి… ఆరోగ్య సంరక్షణ నిపుణుల నుంచి కూడా సహాయం పొందవచ్చు.

అభినందించుకోండి

ధూమపానం మానేయడం ఒక పెద్ద విజయం. ఈ ప్రాసెస్‌లో ఎవరిని వారు అభినందించుకోవాలి. ధూమపానం మానేయడానికి దగ్గరవుతున్న రోజులను సెలబ్రేట్‌ చేసుకోండి.. మసాజ్‌ చేయించుకోవడం, కొత్త దుస్తులు కొనడం, స్పెషల్‌ మీల్‌ వంటివి చేయవచ్చు. ధూమపానం తప్ప మరో విధంగానైనా జర్నీని సెలబ్రేట్‌ చేసుకోవచ్చు.

అస్సలు వదలొద్దు..

ధూమపానం మానేయడం ఒక ప్రయాణం.. ఈ జర్నీలో మీరు చాలా ఇబ్బందులు పడతారు.. చాలాసార్లు తాగాలి అనిపిస్తుంది.. మిమ్మల్ని మీరు కంట్రోల్‌ చేసుకోలేక తలనొప్పి, ఫ్రస్టేషన్‌, చిరాకు ఇవన్నీ వస్తాయి. మధ్యలో పొరపాటున స్మోక్‌ చేస్తే, నిందించుకోవాల్సిన అవసరం లేదు. మోటివేషన్‌ గుర్తు చేసుకుని, తిరిగి ట్రాక్‌లోకి రావాలి. తాగాలి అనిపించినప్పుడు ఏదైనా తినడం, చప్పరించడం వంటివి చేయండి.. ఈరోజు సాధ్యం కాకపోవచ్చు.. కానీ ఒకరోజుకు మాత్రం మీరు కచ్చితంగా స్మోకింగ్‌ మానేస్తారు..

Read more RELATED
Recommended to you

Latest news