గతకొంతకాలంగా చంద్రబాబు టైం ఏమీ బాగున్నట్లు లేదు అనేది తమ్ముళ్ల ఆవేదన. దానికి కారణం… బాబు ఆలోచనా విధానమా.. తన పరిపాలనలో జరిగిన అవినీతి కార్యక్రమమా.. బాబు బ్యాచ్ నిర్లక్ష్యమా.. సీఎంగా బాబు చేతకానితనమా.. చినబాబు అవగాహనలేని అత్యుత్సాహమా.. అన్నదిశగా ఆలోచించడం లేదంట. సరికదా… ఆ బ్యాడ్ పరిస్థితులకు కారణం… జాతకమా.. నివాసముంటున్న ఇంటి వాస్తా.. అని ఆలోచించడం మొదలుపెడుతున్నారంట!
అవును… బాబు బ్యాడ్ పరిస్థితులకు, ఆల్ మోస్ట్ నేలంటేసిన పరిస్థితులకు కారణం బాబు నివాసముంటున్న కరకట్ట ఇల్లే అని కొత్త టాక్ తీసుకొస్తున్నారంట తమ్ముళ్లు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్ట్లు.. కరకట్ట ఇంటిమీద, ఆ ఇంటి వాస్తు సిద్ధాంతి మీదా పడుతున్నారని అంటున్నారు. దానికి కూడా వారు బలమైన కారణాలనే చూపించడం ఈ సందర్భంగా కొసమెరుపు!
బాబు ఏనాడైతే.. అక్రమ కట్టడంగా వైకాపా నేతలు చెబుతున్న కరకట్ట ఇంటికి చేరుకున్నారో అక్కడనుంచి బాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందంట. కరకట్ట ఇంటిదగ్గర కాపురం పెట్టినప్పటినుంచి మొదలు… జగన్ పాదయాత్ర మొదలెట్టడం, ప్రజల్లో బాబు గ్రాఫ్ రోజు రోజుకీ పడిపోవడం జరిగాయంటున్నారు. అవన్నీ గ్రహించి ఆ ఇంటికి వాస్తు రీత్యా ఎన్నో మార్పులు చేసినా.. అనంతరం ఎన్నికలు వచ్చి చావుతప్పి కన్నులొట్టబోయిన ఫలితాలు రావడం… వీటన్నింటికీ అదే కారణంగా చెబుతున్నారంట.
ఇదే క్రమంలో చరిత్రలో ఎన్నడూలేని విధంగా కృష్ణానదికి వరదలు రావడం.. ఫలితంగా గతేడాదిలో మెజారిటీ రోజులు బాబు భాగ్యనగరంలోనే తలదాచుకోవడం తెలిసిందే. వీటన్నింటికీ కారణం కరకట్ట ఇల్లే అనేది వారి వాదంగా ఉంది! ఇదే సమయంలో ఈ ఏడాది అయినా ఏమైనా బాగుంటుందని హైదరాబాద్ లోనే పూర్తిగా మకాం పెట్టినా… కరోనాతో అదికాస్తా శాస్వత విడిదిగా మారిపోయింది.
తాజాగా బాబు కలల రాజధాని అమరావతి కూడా బాబు ఆశించిన స్థాయిలో కాకుండా చేయిదాటిపోవడం కూడా జరిగింది. ఇదే సమయంలో వీలైనంత తొందర్లో ప్రతిపక్ష హోదా కూడా పోయే ప్రమాధం ఉందనే సంకేతాలు అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అయితే… వీటన్నింటికీ కరకట్ట ఇళ్లే కారణం అని అంటున్నారంట!!
దీంతో వీలైనంత తొందర్లో ఉండవల్లి లోని కరకట్ట ఇంటిని బాబు ఖాళీ చేసేసి.. భాగ్యనగరానికే పరిమితం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు!! ఆ సంగతులు అలా ఉంటే… బాబు విశాఖలో ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది!!