కార్తీకదీపం 1225 ఎపిసోడ్ : సౌందర్య ఇంట్లో పెద్ద ఆల్భమ్ పెట్టిన మోనిత..ఇక్కడ తీస్తే బయట ఫ్లెక్సీ కడతా అని బెదిరింపు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో పిల్లలు.. స్కూల్ కి వెళ్తున్నాం అనేకాని..బ్యాగ్ , బుక్స్ ఏం లేవు డాడీ అంటారు. సరే సోమవారం నుంచి బ్యాగ్, బుక్స్ కొనుక్కోని వెళ్దాం అంటాడు కార్తీక్. హిమ సంక్రాంతికి మనం నానమ్మ వాళ్ల ఇంటికి వెళ్దామా అంటుంది. శౌర్యకు దీప మాటలు గుర్తుకువచ్చి..ఎక్కడకు వెళ్లొద్దు..స్కూల్ కు కూడా సోమవారం నుంచి వెళ్దాం అంటుంది. ఇంతలో దీప వస్తుంది. స్కూల్ కి ఈరోజు మంచిరోజు కాదులే అమ్మా అంటుంది దీప. హిమ సంక్రాంతి పండుగ గురించి చెప్తూ..మా ఇద్దరికి పట్టుపరికిణీలు కుట్టించి, మీ ఇద్దరూ కొత్తబట్టలు కొనుక్కోండి అంటుంది. ఏంటి పండగ గురించి అప్పుడే ప్లాన్ చేస్తున్నారు అంటుంది. ప్లానింగ్ ఏం లేదులే అమ్మా అంటారు. సరే మీరు బయటకు వెళ్లి ఆడుకోండి అంటుంది దీప. కార్తీక్ కు జరిగింది చెప్తుంది దీప. తనని ఎదిరించాం అని మనమీద వాళ్లకు కోపం. తనని నేను కొట్టాను కదా అంటే..నువ్వే కదా నేను ఆ రుద్రాణి మనుషులను కొట్టాను అని..ఆ రోజు జరిగింది చెప్తాడు. అసలే ఇది కొత్త ప్రదేశం అంటే..ప్రదేశం మారినంత మాత్రనా న్యాయం ధర్మం మారదు కదా దీప అని కార్తీక్ బయటకు వెళ్తాడు.

karthika-deepam

ఇక్కడ మోనిత పెద్ద ఫోటో తెచ్చి ప్రియమణిని పిలుస్తుంది. అందరూ వస్తారు. ఇదేంటో చెప్పుకోండి చూద్దాం అంటుంది. అందరూ సీరియస్ గా చూస్తారు. మోనితే ఆ ఫోటో తీసి చూపిస్తుంది. దోషనివారణ పూజ చేసినప్పుడు తీసిన ఫొటోను పెద్ద ఫ్రేమ్ కట్టించి తీసుకువస్తుంది. ఆదిత్య రొటీన్ డైలాగ్..మమ్మీ ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అంటాడు. ఆదిత్య కొంచెం కోపం తగ్గించుకోండి అని మోనిత గోడకు తగిలిస్తుంది. ఆదిత్య ఫోటో తీయబోతే..మోనిత నువ్వు ఇంట్లో ఫొటో తీసేస్తే..నేను ఏం చేస్తానో తెలుసా..ఇంటి ముందు పది ఫ్లెక్సీలు తీసి పెట్టిస్తాను..వీధిలో పెద్దతోరణాలుగా పెట్టిస్తాను. ఇంట్లో ఫొటో ఉండనిస్తావా..ఫ్లెక్సీలు పెట్టనిస్తావా అంటుంది. ఆదిత్య కామ్ గా వెళ్లినుల్చుంటాడు. అది సంగతి అంటుంది మోనిత. సౌందర్య ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ అంటుంది. మోనిత ఎక్కువే చేస్తాను..తప్పదు ఆంటీ..స్విచ్చ్ వేషన్ అలాంటిది..మీరు నన్ను తిట్టినా కొట్టినా..నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాను..దీపక్క ఒక్కమ మాట అన్నందుకే వెళ్లిపోయింది. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లు మీరే ఆలోచించండి అంటూ..సోది డైలాగ్స్ అన్నీ చెప్పి వెళ్తుంది.

మరోపక్క శ్రీవల్లి వాళ్లు బిడ్డను తీసుకుని వస్తారు. చెట్టుకింద సామాన్లు కనిపించకపోయేసరికి వాళ్లు టెన్షన్ పడతారు. ఇంతలో కార్తీక్ వచ్చి మీ సామాన్లు అన్నీ ఇంట్లో సర్ధాం. మీరు కూడా రండీ అని తీసుకెళ్తాడు. దీప వాళ్లకు దిష్టి తీస్తుంది. డెలివరీ బానే జరిగినట్లు ఉంది అనుకుంటాడు కార్తీక్. మాకు ఏదైనా వేరే ఇళ్లు దొరికే వరకూ ఇక్కడే ఉంటాం అంటే..మీరు ఎక్కడకు వెళ్లొద్దు అక్కా అంటారు. కానీ ఆ రుద్రాణి అని అంటే..రుద్రాణి విషయం నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అంటుంది. అదంతా రుద్రాణి మనిషి చూస్తాడు.

సౌందర్య పెద్దోడా ఎంత పని చేశావురా అని బాధపడుతూ ఉంటుంది. ఆదిత్య వచ్చి ఏం చేద్దాం మమ్మీ అంటాడు. చేయటానికి ఏం పాలుపోవడంలేదురా అంటుంది సౌందర్య. ఆదిత్య..అసలు ఇదంతా చేయడానికి కారణం నువ్వే..నువ్వు ఆ పూజ చేయటం వల్ల తనకి ఇంత బలం వచ్చింది..తను రేపు గొడవ ఎక్కువ చేస్తే..అన్నయ్య పక్కన భార్య స్థానంలో ఉంచేలా ఉన్నారు..ఆదిత్య తన కోపాన్ని అంతా సౌందర్య మీద చూపిస్తాడు.

ఇంకోసీన్ లో దీప బాబును ముద్దు చేస్తూ ఉంటుంది. కార్తీక్ చూసి..రోజులు బిడ్డలా లేడే..వీడి వయసు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అంటాడు. దీప నాకు అదే అనిపించింది..ఈ బిడ్డ ఎవరూ నిజం చెప్పు అంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news