ఇంట‌ర్ రిజ‌ల్ట్ ఎఫెక్ట్‌.. న‌ల్గొండ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

-

నిన్న తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్షా ఫ‌లితాలు విడుదలైన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ ప‌రీక్ష ఫ‌లితాల్లో కేవ‌లం 49 శాతం మాత్ర‌మే… ఉత్తీర్ణులు అయ్యారు. లాక్ డౌన్, క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ప‌రీక్ష‌ల‌పై దృష్టి పెట్ట‌లేదు. దీంతో… నిన్న విడుద‌ల అయిన ఫ‌లితాల్లో.. ఉత్తీర్ణ‌త శాతం తగ్గింది. అలాగే.. చాలా మంది.. త‌క్కువ స్కోర్ తెచ్చుకున్నారు.

ఇది ఇలా ఉండ‌గా.. నల్లగొండ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గాంధీనగర్‌ కాలనీలకి చెందిన విద్యార్తిని జాహ్నవి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని స‌మాచారం అందుతోంది. అయితే.. ఈ ఘ‌ట‌న పై స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు.. చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఇంట‌ర్ పరీక్ష‌ల్లో మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చాయ‌ని.. ఆ అమ్మాయి ఆత్మ‌హ‌త్య చేసుకుందా లేక‌.. ఇంకేమైనా కార‌ణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news