కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో శ్రీవల్లి బాబును చూసి కార్తీక్, దీప అనుమానిస్తారు. రోజుల బిడ్డలా లేడే అంటాడు. దీప కోటేష్ తో ఈ బిడ్డ ఎవరూ, నిజం చెప్పు అంటుంది. కోటేష్ ఒక కథ చెప్తాడు. ఈసారి కూడా బిడ్డపోయింది..మా అదృష్టం కొద్ది హాస్పటల్ లో అనాథ బిడ్డ దొరికితే..అందరికి చెప్పి, సైన్ చేసి తీసుకొచ్చాను అంటాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అంటాడు, పర్లేదులే కొటేష్ అంటారు. ఇక్కడ రుద్రాణి పెరుగన్నం లాగిస్తూ ఉంటుంది..ఇంతలో అబ్బులుగాడు వచ్చి శ్రీవల్లి వాళ్లు ఇంట్లోకి వెళ్లారు అని చెప్తాడు. రుద్రాణికి పిచ్చకోపం వస్తుంది.
ఇంకోపక్క పిల్లాడితో శౌర్యవాళ్లు ఆడుకుంటూ ఉంటారు. శ్రీవల్లి మీరు డబ్బున్నవాళ్లులా ఉన్నారు, ఎవరు మీరు, ఎక్కడినుంచి వచ్చారు అంటుంది. దీప పిల్లలని పంపించి..మాది విజయనగరం, పరిస్థితి బాలేక అక్కడినుంచి వచ్చాం అని చెప్తుంది. ఆ రుద్రాణి ఏం చేస్తుందో అంటే ఏదో ఒకటి ఆలోచిద్దాంలే మీరేం భయపడకండి అంటాడు కార్తీక్.
మరోసీన్ లో ఈ మోనిత గోడకు పెట్టిన ఫొటోతో సెల్ఫీలు దిగుతుంది. అసలు ఈమెకు బిడ్డ ఏమయ్యాడు, ఎవడు తీసుకెళ్లాడుని అని ధ్యాసే లేదేంటో..ప్రియమణి వచ్చి ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతుంది. ఏం చేస్తున్నాం ఏంటి ప్రియమణి..చూడు ఈ ఇంట్లో మీ కార్తీకయ్య ఇంట్లో మనం ఉన్నాం, ఈ ఫొటో ఈ నట్టింట్లో వేలాడుతుందని నువ్వు ఎప్పుడైనా ఊహించావా, ఈ ఇంట్లో కోడలిగా అందిరి నోళ్లు మూయిస్తానని నువ్వు ఎప్పుడైనా ఊహించావా లేదు కదా..నా కలలను అన్నీ నిజం అవుతున్నాయని ప్రియమణి అని మురిసిపోతుంది. ఇంతలో సౌందర్య వచ్చి ఆ ఫోటో నేలకేసి కొడుతుంది. ఏంటే ప్రియమణి ఈ ఫోటోను నేలకేసి కొడతానని నువ్వు ఊహించావా అంటుంది. ఏం మోనిత నువ్వు ఊహించావా అని..కార్తీక్, దీప పిల్లలు ఎక్కడికి వెళ్లారో తెలియక మేం టెన్షన్లో ఉన్నాం, ఇలాంటప్పుడు నువ్వు కట్ఔట్ పెడతాను అంటూ బెదిరిస్తున్నావా..నీ బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరిక్కడ. అవసరమైతే నిన్ను చంపి..నీ సంతాప సభలో పెద్ద కట్ఔట్ నేను కడతాను..నిన్ను ఇంట్లోంచి భయటకు పంపించటం చిటెకలో పని, కొడుకు కనిపించటం లేదు అని వచ్చావ్, అందులో నిజమెంతో తెలియదు, కష్టాల్లో ఉన్నావని నీ మీద జాలి చూపించాను..నిజంగా నీ బిడ్డను ఎవరైనా ఎత్తుకెళ్లారో, లేక నువ్వే నాటకాలు ఆడుతున్నావో తెలియాలని నేను ఇక్కడ ఉండనిచ్చాను..అంతేకాని.నీ తాటాకు చప్పుళ్లకు భయపడి కాదు , నువ్వు ఇలానే కలలు కంటూ ఉంటూ..నిన్ను నీ అసిస్టెంట్ ప్రియమణిని..గేట్ బయటదాకా గెంటేస్తాను అని ప్రియమణిని అదంతా క్లీన్ చేయమి చెప్పి వెళ్తుంది. ఏంటో ఒకరోజు మోనితను లేపుతారు..ఒకరోజు సౌందర్యను లేపుతారు. ఆ విసిరి కొట్టేది ఏదో నిన్ననే కొట్టొచ్చుగా.
ఇక్కడ కార్తీక్ వాళ్ల దగ్గరకు రుద్రాణి మనిషి అబ్బులు వచ్చి అక్క నిన్ను రమ్మంది అంటాడు. రాకపోతే..అక్కే వస్తుంది అంటాడు. రుద్రాణి వస్తే మొన్న జరిగిందే జరుగుతుంది అనుకుని అబ్బులతో కలిసి కార్తీక్ వెళ్తాడు. ఇక్కడ ఆదిత్య మోనిత అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. శ్రావ్య వచ్చి పాలు తీసుకో అంటే..పాలు కాదు శ్రావ్య ఇంట్లో అందరూ విషం తీసుకునే పరిస్థితి వచ్చింది అంటాడు. ఏంటి ఆదిత్య అని శ్రావ్య అంటే..తన గొంతు పట్టి గేట్ బయటదాక గెంటేయాలని అనిపిస్తుంది అని ఆదిత్య అంటే..శ్రావ్య నువ్వు ఏం చేయలేం ఆదిత్య అంటే..ఏంటి శ్రావ్య ఎటకారం చేస్తున్నావా అని ఆదిత్య అంటే..మీరు భయపడే ఆ మోనితకు బలంపెంచారు అంటుంది. ఏదో ఒకటి చేసి ఆ మోనితను ఇంట్లోంచి వెళ్లగొడతాను అంటాడు ఆదిత్య
దీప కార్తీక్ ను రుద్రాణి ఈ టైంలో ఎందుకు పిలిచినట్లు, ఏదైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ రుద్రాణి దగ్గర ఉంటాడు. రుద్రాణి తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. ఆ దస్తావేజుల మీద సంతంక పెట్టు, ఏ ఊరో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఇంట్లో ఉంటా అన్నారు..ఉండమంటే ఆ కొటేష్ గాడి సామాన్లు లోపలపెట్టారు..నీ పెళ్లాం ఆ శ్రీవల్లి, కోటేష్ ను ఏకంగా ఇంట్లో పెట్టింది..అంటూ ఆ కోటేష్ స్టోరీ మళ్లీ చెప్తుంది. దస్తావేజ్ లో రుద్రాణి రూల్ ప్రకారం ఆ అప్పు నువ్వు కట్టు, ఈ పత్రం మీద సంతంకం పెట్టు..మొత్తం 3లక్షల20 వేలు.నెల రోజుల గడువు. సంతంకం పెడతావా, వాళ్లను రోడ్డమీదకు ఈడ్చమంటావా అంటూ చెప్పబోతుంది..కార్తీక్ నేను తీరుస్తాను అంటాడు.
నాకేం సంబంధం లేదు అని..ఆ శ్రీవల్లి కోటేష్ లు మీ ఇష్టం అని వెళ్లిపో నీకే బాధ ఉండదు అని రుద్రాణి అంటే..మనోడు హీరాలెక్క సంతకం చేస్తాడు. ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయిభాగంలో అక్కా సంతంకం పెట్టాడు సరే..డబ్బులు ఇవ్వకపోతే అంటే..నాకు తెలివి ఉందిరా..డబ్బు ఇవ్వకపోతే..ఇద్దరు అమ్మాయిలు ఉన్నారుకదా..అందులోంచి ఒకరిని తెచ్చుకుంటా అని అగ్రిమెంట్ లో రాయించానురా అంటుంది రుద్రాణి. అసలు వీళ్లే కష్టాలను వదిలేసి కొత్త జీవితం స్టాట్ చేద్దాం అని వచ్చారు..కనీసం అదైనా మంచిగా పెట్టొచ్చుగా..ఈ పంచాయితీ అంతా అవసరమా..ఎప్పుడు చూసినా గొడవలు. సీరియల్ సాగదీయాల కానీ మరీ ఇంత చెండాలంగానే ప్రేక్షకులు అంటున్నారు.