కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, కార్తీక్ పూజకు కారులో వెళ్తుంటారు. కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ..కారు సడన్గా ఆపేస్తాడు. సౌందర్య ఏమైంది కార్తీక్ అంటే..వెనక్కు వెళ్లిపోదాం మమ్మీ అంటాడు, నా వల్లకాదు, నా మనసు ఒప్పుకోవటం లేదు. అన్నీ మనసు ఒప్పుకునే పనులే చేస్తున్నావా కార్తీక్ అంటే..ఏంటో మమ్మీ..దీపకు అన్యాయం చేస్తున్నాను అనిపిస్తుంది అంటాడు కార్తీక్. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.., ఇప్పుడు నువ్వు చేయాల్సిన న్యాయం ఏదైనా ఉంది అంటే నాతో కలిసి పూజకు రావటమే అంటుంది. కార్తీక్ నేను ఆ మోనితతో కలిసి పూజచేయటం అంటేనే అని చెప్పబోతుంతాడు..సౌందర్యఫైర్ అవుతుంది, మాట్లాడకు కార్తీక్, చెప్పిచెప్పి విసిగిపోయాను నేను అని ఫైనల్ గా..నా పెద్దకోడలికోసం నువ్వురావాలి అంతే..నువ్వు పూజకు వస్తాను అంటే..కారు స్టార్ చేయ్..లేదంటే ఇప్పుడే చెప్పు నేనే కారుదిగి నడుచుకుంటూ వెళ్లిపోతాను అంటుంది. కార్తీక్ కారు స్టాట్ చేస్తాడు.
ఇక్కడ మోనిత కూడా ప్రియమణితో కలిసి కారులో వస్తూ మాంచి ఊపున్న సాంగ్స్ పెట్టుకుని ఓ ఆనందం పడుతూ ఉంటుంది. నేను గెలిచాను ప్రియమణి, నేనేంటి కార్తీక్ పక్కన కుర్చుని పూజచేయటం ఏంటి, ఆ ఫ్రేమ్ ఊహించుకుంటేనే మనసు పులకరిస్తుంది అని ఏదేదో ఊహించుకుంటుంది. అంతా మా ఆనంద్ రావుగారి వల్లే అంటుంది. మరోపక్క దీప కూడా వారణాసి కారులో వెళ్తు ఉంటుంది. వారణాసి అక్కా అంటే..ఏంట్రా మళ్లీ ప్రశ్నలు అడుగుతున్నావా, అమెరికా వెళ్లలేదు అని..ఏంటో అక్క ఈ మద్య నిన్ను ఏమడగాలనన్నా భయమేస్తుంది, మారిపోతున్నావ్ అక్కా..ఇంతకు ముందు నిన్ను ఏమడగాలన్నా అడిగేసావాడ్ని..నువ్వు సరదాగా మాట్లాడేదానివి అంటాడు. సరదా నా జీవితంలోంచి సరదాగా వెళ్లిపోయిందేమోరా అంటుంది. ఇందాక పిల్లలను స్కూల్ లో దింపాక ఎక్కడికి వెళ్లొచ్చావ్ అక్కా అంటాడు. ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో నాకే తెలియటం లేదు వారణాసి అంటుంది. వారణాసి అన్ని కష్టాలు ఉన్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండేదానివి మరి ఇప్పుడు ఏమైంది అక్కా..ఇంత టెన్షగా ఉంటున్నావ్ అంటాడు. దీప దిగాలుగా..చాలానే ప్రశ్నలు వేశావ్ రా..టైం వచ్చినప్పుడు చెప్తాలే అంటుంది.
కార్తీక్ సౌందర్యతో మళ్లీ ఓ సారి ఆలోచించు..దీపను మోసం చేస్తున్నానామో కదా అంటాడు. మోసం చేస్తున్నామేమో కాదు కార్తీక్, దీపకు మోసం జరిగిపోయింది..ఎప్పుడైతే మనం దీపకు చెప్పకుండా మోనిత దగ్గరకు వెళ్లామో దీపకు అన్యాయం జరిగింది. ఈ పూజ నా మనశాంతి కోసమే అంటుంది. నా మనసు ఒప్పుకోవటం లేదు మమ్మీ, ఈ పూజ కాన్సిల్ చేసుకుందాం మమ్మీ అంటాడు. కార్తీక్ కారు ఆపు..గుడివచ్చింది కారు ఆపు అంటుంది సౌందర్య. ఎలాగైతే సౌందర్య కార్తీక్ ను గుడిలోకి తీసుకెళ్తుంది. దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారణాసి మనసులో అక్కకు ఏమైందో ఏంటో అడిగితే చెప్పదు అనుకుంటాడు. దీప వారణాసిని వేరే డైరెక్షన్ లో వెళ్లమంటుంది. మనం వెళ్లాల్సింది అటుకదా అంటాడు వారణాసి. చెప్పింది చేయవా..నీకు దన్నం పెడతాను అంటుంది. సరే అక్కా అంటాడు వారణాసి. దీప మనసులో చూద్దాం నేను ఊహించింది జరుగుతుందో లేదో అనుకుంటుంది.
ఇంట్లో ఆనంద్ రావు దీప గురించి ఆలోచిస్తాడు. సౌందర్య, కార్తీక్ లకు నేను చెప్పేది అర్థంకాదు. ఒకవేళ ఆ మోనిత సరాసరి ఇంటికే వచ్చేస్తే అనుకుని టెన్షన్ డుతుంటాడు. మోనిత కూడా గుడికి వచ్చేస్తుంది. మోనిత కారుదిగి ప్రియమణి నువ్వొక పనిచేయాలి అని..ఏదో చెప్తుంది. ఏదో ప్లాన్ వేసినట్లు ఉంది. కారులో దీప కూడా అదే గుడికి వెళ్తున్నట్లు ఉంది. పూజారి రాసిన లిస్ట్, సౌందర్య ప్రవర్తన అన్నీ తలుచుకుంటుంది. గుడిలో పూజారి నిర్ణయించుకున్న సమయం దగ్గరపడింది, మీ కోడలుగారు ఎక్కడా ఇంకా రాలేదు అంటాడు. కార్తీక్ కు కోపం వస్తుంది…తను అని చెప్పకబోతే.. సౌందర్య కార్తీక్ పూజ అయ్యేవరకూ నేను చెప్పింది చేయ్ అని తను వస్తుంది పంతులుగారు అని చెప్తుంది. బట్టలు మార్చుకోవాలి అని పట్టుబట్టలు ఇస్తారు. కార్తీక్ కు ఇష్టంలేకున్నా బలవంతం మీద ఒప్పిస్తారు. మోనిత గుడిలోకి వస్తూ..దేవుడు ఉన్నాడు ప్రియమణి లేకపోతే నన్ను చూస్తేనే ఈసడించుకునే కార్తీక్ ఫ్యామిలి ఇప్పుడు నన్ను ఇంటికి వచ్చి ఆహ్వానించటమేంటి అసలు, కొన్ని రోజులైతే కోడలికిగా రమ్మంటారామే అని కార్తీక్ ను చూస్తుంది. అబ్బా నా కార్తీక్ పెళ్లికొడుకులా భలే ఉన్నాడు అనుకొని వాళ్ల దగ్గరకు వెళ్తుంది. కావాలనే అత్తయ్యగారు నేను ఏమైనా లేటుగా వచ్చానా అంటుంది. పంతులిగారితో భార్య భర్తకు ఏడమవైపే కదా కుర్చోవాల్సింది అంటుంది. అవునమ్మా అని చెప్పటంతో కార్తీక్ ఎడమవైపు కుర్చుంటుంది. కార్తీక్ కు మోనితను చూస్తే కోపం వెయ్యిరెట్లు అధికంగా వస్తుంది. కానీ ఏం చేయలేక అలానే కామ్ గా కుర్చుంటాడు. పూజ స్టాట్ అవుతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.