కార్తీక మాసం అంతటా కూడా ప్రతి ఒక్కరి ఇల్లూ కూడా దీపాలతో కళకళ్ళాడతాయి. కార్తీకమాసం అంతటా కూడా పూజలు చేస్తారు. అయితే ఈ రోజు కార్తీక మాసంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి..?, ఎలాంటి ఫలితం పొందచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం పూర్తిగా చూసేద్దాం.
కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, అభిషేకం దీపారాధన చేయడం చాలా మంచిది. సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈనెల అంతటా కూడా శివుడిని పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. దైవ చింతన మెండుగా ఉంటుంది.
కార్తీక మాసంలో ముఖ్యమైన రోజు ద్వాదశి క్షీరాబ్ది. ద్వాదశి నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితం కనబడుతుంది. కార్తీక మాసంలో ప్రతి రోజూ దీపం వెలిగించి ఉంటే మంచిది. అలా ప్రతిరోజూ చేయలేని వారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకుని పూజ చేస్తే పుణ్యఫలం పొందొచ్చు.
కార్తీక మాసంలో సోమవారాలు నాడు ఉపవాసం చేస్తే ఎంతో మంచిది. పరమశివుని కొలవడం పంచామృతముతో అభిషేకం చేయడం నదీ స్నానం చేయడం చాలా పుణ్య కరం. కార్తీక పౌర్ణమి రోజున అయితే శివుడుని పూజించి జ్వాలాతోరణం దర్శించుకోవాలి. అలానే కార్తీకమాసంలో వనభోజనాలు కూడా నిర్వహిస్తారు. దీని యొక్క ప్రస్తావన కూడా కార్తీక పురాణం లో ఉంది. ఇలా కార్తీక మాసంలో శివుడికి ఈ విధంగా అనుసరిస్తే విశిష్ట ఫలితాన్ని పొందొచ్చు.