కత్తి కార్తిక కథ అడ్డం తిరిగిందా

-

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆర్ జె యాంకర్ కత్తి కార్తిక అడ్రెస్ లేకుండా పోయింది.నియోజకవర్గంలోని మకాం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటానని ప్రగల్బాలు పలికింది,ఎమ్మెల్యే అంటే ఇక్కడే ఉండాలి కదా అని సినిమా డైలాగు లు చెప్పింది. ఇంకేముంది కత్తి కార్తీక దుబ్బాక ఎమ్మెల్యే అయిపోయినట్లే అని అనుచరులు తో కోరస్ చెప్పించుకుంది, తీరా ఫలితాలు రోజు ఈ వీ ఎం లు తెరిస్తే మూడంకెలా ఓట్లు కూడ సాదించలేకపోయింది. డామిట్ కధ అడ్డం తిరిగింది,తట్ట, బుట్ట సర్దుకుని సిటీ కి చెక్కేసింది.

రామలింగారెడ్డి మృతితో నియోజకవర్గంలో వాలిపోయింది కత్తి కార్తీక,  అంత లేదు ఇంత లేదు అని తుస్సు మనిపించింది,ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించింది, ఇంత లో ఫార్వార్డ్ బ్లాక్ టికెట్ సంపాదించి ఎన్నికల బరి లో నిలిచింది. ప్రచారం జరిగినన్ని రోజులు బి ఎం డబ్ల్యూ , స్కోడా , రేంజ్ ఓవర్ కార్ల తో తెగ హల్చల్ చేసింది, ఎవరయినా మేడం ని కలవాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనే స్థాయిలో కలరింగ్ ఇచ్చింది. పలితాలు వెలువడ్డాక తెలిసింది ఆమె తో ప్రచారం తిరిగిన వారి ఓట్లు కుడా ఆమె కి పడలేదని….621 ఓట్ల తో డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయింది.

ఎన్నికల టైం లో కూడా ల్యాండ్ విషయం లో మోసం చేసింది అని కత్తి కార్తీక మీద బంజారా హిల్స్ పీ ఎస్ లో కేసు నమోదు అయింది, అవి తనని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారని కొట్టి పడేసింది, తనను ఎన్నికల్లో ఎదుర్కొలేక కుట్రలు చేస్తున్నారని సెంటిమెంట్ సీన్ లు చెప్పింది, సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని పొంతన లేని సమాధానాలు చెప్పింది, ఆడపడుచుని ఆశీర్వదించాలని భారీ డైలాగు లు చెప్పింది, ప్రధాన పార్టీలకు బుద్ధి చెప్పాలన్న, నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అన్న తనకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించింది, ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాను అని చెప్పిన కత్తి ఇక్కడ ఇమడలేక తన దారి తాను చూసుకుంది.మొత్తానికి ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీ కి వెళ్దాం అనుకున్న కత్తి కంటెస్ట్ ఎమ్మెల్యే గా మిగిలారు,

Read more RELATED
Recommended to you

Latest news