కలిసి పని చేసుకోండి… విశాఖ పంచాయితీ క్లోజ్ చేసిన జగన్…!

విశాఖలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సిఎం జగన్ వద్దకు జరుగుతుంది. తన వద్దకు చేరుకున్న విశాఖ పంచాయితీని సిఎం జగన్ పరిష్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి నేడు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి, విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాధ్ తో సిఎం జగన్ మాట్లాడారు.

విశాఖ డీడీఆర్సీ సమావేశంలో భూములు, నాడు-నేడు అవినీతిపై చర్చ జరగగా అది క్రమంగా రచ్చకు దారి తీసింది. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఇది మీడియాలో రావడంతో ముగ్గుర్నీ పిలిపించిన సీఎం జగన్,… ఏం జరిగిందనే అంశంపై ముగ్గురిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అందరూ కలసి పనిచేయాలని సీఎం జగన్ నేతలకు సూచించారు. అవినీతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.