కవిత సైలెంట్ అయ్యారా? సైలెంట్ చేశారా?

-

ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు వినిపించిందో అప్పటినుంచి ఆమె రాజకీయంగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ స్కామ్‌లో కవిత ఉన్నారని ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే దీనిపై కవిత కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని…కేసీఆర్‌ని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ తనని టార్గెట్ చేసిందని విమర్శించారు.

ఇక ఈ విషయంలో బీజేపీ నేతలు…కవిత ఇంటి దగ్గర ఆందోళనలు చేయడం…వారిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇలాంటి విషయాల్లో తలదూర్చవద్దని కవితకు…కేసీఆర్ సూచించారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అలాగే ఇటీవల శాసనసభాపక్ష సమావేశంలో కూడా కేసీఆర్..ఈడీ, సీబీఐలకు అవకాశం ఇచ్చే పనులు చేయొద్దని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చారు.

అయితే ఇంతటితో కథ అయిపోలేదు…కవిత ఈ మధ్య రాజకీయంగా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండటం లేదు. తాజాగా కేసీఆర్…నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్…టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో కవిత పాల్గొనలేదు. అనంతరం భారీ సభ జరిగింది…ఆ సభలో కవిత పాల్గొన్నారు…కానీ ప్రసంగించలేదు. ఒక ఎమ్మెల్సీ…అందులోనూ కేసీఆర్ కుమార్తె…అయినా సరే ఆమె ప్రారంభోత్సవంలో లేరు..అలాగే సభలో ప్రసంగించలేదు.

అంటే ఆమె కావాలని సైలెంట్ అయ్యారా? లేక కేసీఆర్ కావాలని సైలెంట్ చేశారా? అనేది క్లారిటీ రావడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన పేరు వచ్చిన దగ్గర నుంచి కవిత ఇదే తరహాలో ముందుకెళుతున్నారు. మరి ఇలాంటి సమయంలో బయటకొచ్చి ఏది మాట్లాడినా ఇబ్బంది అవుతుందని ఆమె సైలెంట్ అయ్యారా? అనేది తెలియదు. లేదా కొన్ని రోజులు సైలెంట్ గా ఉండాలని కేసీఆర్ సూచించరా? అనేది కూడా తెలియదు. మొత్తానికైతే కవిత సైలెంట్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news