బిగ్ బాస్ 6: బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత అలాంటి కామెంట్స్ చేసిన వీ.జే.సన్నీ..!

-

ప్రముఖ సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వీ.జే.సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని.. తన టాస్క్లతో, గేమ్ లతో అందరికంటే ఎక్కువ అభిమానులను సంపాదించుకొని సీజన్ 5 టైటిల్ విజేతగా నిలిచారు. ఇకపోతే టైటిల్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు కానీ ఇప్పుడు ప్రముఖ కమెడియన్ సప్తగిరి తో కలిసి ఒక సినిమాలో మల్టీ స్టారర్ మూవీ చేసే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అయిన నేపథ్యంలో వీ. జే. సన్నీ బిగ్ బాస్ ను దృష్టిలో పెట్టుకొని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు.ఇకపోతే బిగ్ బాస్ షో గురించి బయట వ్యక్తులు ఎక్కువగా విమర్శలు చేయడం మనం చూసే ఉన్నాం కానీ తాజాగా బిగ్ బాస్ షో విన్నర్ సన్నీ ఇలా విమర్శలు చేయడంతో సర్వత్ర సంచలనంగా మారింది. ఈ షో వల్ల ఎటువంటి ప్రయోజనం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇకపోతే సీజన్ ఫైవ్ లో పాల్గొని టైటిల్ ను గెల్చుకున్న సన్నీ ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకొని దూసుకు వెళ్తున్నారు. బిగ్ బాస్ షో తోనే ఇంత గుర్తింపు తెచ్చుకున్నాడు సన్నీ. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది.అయితే ఇవన్నీ కూడా బిగ్ బాస్ 5 పూర్తి అయిన తర్వాతనే రావడం విశేషం. తనకు ఇంత మంచి గుర్తింపు ఇచ్చిన బిగ్ బాస్ ను విమర్శిస్తూ ఈ షో వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు.. చాలామందికి ఈ షో గురించి కూడా తెలియదు బిగ్ బాస్ లో విన్నర్ అంటూ ఎవరు పట్టించుకోవడం లేదు అని, విన్నర్ అయితే ఏంటి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు అంటూ సన్నీ తెలియజేశారు.. అంతేకాదు ఒక స్టార్ డైరెక్టర్ కూడా తనని ఈ విధంగా అడిగాడు అని అందుకే తాము బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకోవడం మానేసి, సీరియల్ నటుడిని అని చెప్పుకుంటున్నాము అంటూ ఆయన తెలియజేశారు. ఇక ప్రస్తుతం సినిమాలలో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news