బీజేపీ నాయకులు అసలు..తెలంగాణ బిడ్డలేనా ? : కవిత సంచలనం

-

వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి పార్టీ నేతల కామెంట్స్ పై కల్వకుంట్ల కవిత తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా బీజీపీ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. వారిపై నిప్పులు చెరిగారు. వరి ధాన్యం కొనుగోలు అంశం పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల వితండ వైఖరి చూస్తుంటే వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత.

ధాన్యం సేకరణలో దేశ మంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్ గారు రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కవిత. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. కేంద్రం పంజాబ్‌ లో వడ్లు 100% కొనుగోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవిత ద చేశారు. ధాన్యం కొనుగోలుపై వన్‌ నేషన్ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఉండాలని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news