నాగార్జున సాగర్ ఉప్ప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఆయన మాట్లాడుతూ ఈ సభ జరగకూడదని చెయ్యని ప్రయత్నం లేదని, ఇది తలా తోక లేని ప్రయత్నం అని అన్నారు. ప్రధాని… కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు, కానీ ఈ సభ జరగకూడదని ప్రయత్నం చేశారని కానీ సభ జరుగుతుందని అన్నారు. నేను గత సభలో చెప్పిన… పరిణతి తో ఆలోచించి ఓటు వేయండి అని చెప్పినా, ఆ రోజు సభలో అదే చెప్పా…ఇప్పుడు అదే చెప్తున్నా అని అన్నారు.
మంచి చేసే వారికి మద్దతు ఇస్తే మంచి జరుగుతుంది అని ఆయన అన్నారు. గాడిదలకు గడ్డి వేస్తే ప్రయోజనం లేదని అన్నారు. ఎవరు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు క్లారిటీ వచ్చిందన్న కెసిఆర్ భగత్ కి ఓట్లు ఎట్లా దుంకుతయో… నెల్లికల్లు నీళ్ళు కూడా అట్లా దుంకుతయని అనరు. నెల్లికల్లూ నీళ్లలో మీరు కేరింతలు కొట్టాలి..ఆ సప్పుడు నా చెవుల్లో పడాలని ఆయన అన్నారు.