ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొంత మంది క్యాబినెట్ నుంచి బయటికి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని కొంతమంది క్యాబినెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే క్యాబినెట్లోకి వచ్చేవారు ఎవరో ఏంటనే దానిపై మాత్రం ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. క్యాబినెట్లోకి వచ్చే వాళ్ల విషయంలో పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొంతమందిని క్యాబినెట్ నుంచి ముఖ్యమంత్రి జగన్ పంపించే అవకాశం లేదని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు అని కచ్చితంగా క్యాబినెట్లో కొనసాగించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. చిత్తూరు జిల్లాలో మరో మంత్రిని క్యాబినెట్ నుంచి పంపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సామాజికవర్గాల సమీకరణలు నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేదా ఆర్ కే రోజా క్యాబినెట్లో పదవి వచ్చే అవకాశం ఉంటుంది.
లేకపోతే మాత్రం కేబినెట్ లోకి రావడానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పని తీరు పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైసీపీకి భారీ మెజారిటీ తీసుకువచ్చే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.