కేసీఆర్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా… జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. ఢిల్లీలో కూడా బీజేప భీమ్ పేరుతో పాదయాత్ర చేసింది. దీంతో ఈ అంశం దేశ రాజకీయాలను ఆకర్షించింది. ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ నిరసనలు చేపడుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడుతోంది.
ఈరోజు పార్లమెంట్ లో అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ధర్నాలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్చాలనే వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఆలోచనలనే కేసీఆర్ వ్యక్తపరుస్తున్నారంటూ విమర్శించారు. పార్లమెంట్ లో రేపు కేసీఆర్ వ్యాఖ్యలపై వాయిదా తీర్మాణం ఇవ్వనున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు