రేపటి నుంచే కేసీఆర్ ఢిల్లీ టూర్… షెడ్యూల్ విడుదల

రేపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కు వెళ్లనున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభా కార్యక్రమంలో పాల్గొని, అనంతరం జరిగే బిఎసి సమావేశం తర్వాత సిఎం కెసిఆర్ ఢిల్లీ కి వెల్లనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఈ నెల 25 న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షకావత్ తో సమావేశమౌతారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

అనంతరం 26వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా నేతృత్వంలో… జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ కీలక సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు.
అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో మాట్లాడుతారు. అదే రోజు సాయంత్రం హైద్రాబాద్ తిరుగు ప్రయాణమౌతారు తెలంగాణ సీఎం కేసీఆర్.