కేసీఆర్ సారూ… ఆ పని మాత్రం చేయకండి సారూ…!

-

జాతీయ స్థాయిలో సిఎం కేసీఆర్ వెళ్ళాలి అనుకోవడం చూసి చాలా మంది షాక్ అయ్యారు… అసలు ఆయనకు జాతీయ రాజకీయాలతో పనేంటి ఇప్పుడు అనేది చాలా మంది ప్రశ్న. జాతీయ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తే రాష్ట్రంలో కేటిఆర్ తట్టుకుని రాజకీయం చేస్తారా…? కేసీఆర్ ఢిల్లీలో తిరుగుతుంటే హైదరాబాద్ లో అంతా సవ్యంగా ఉంటుందా…? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వయంగా కేసీఆర్ చెప్పాలి. వాస్తవానికి కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీ నేత. ఒకప్పుడు ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడటంతో ప్రాంతీయ పార్టీ అయింది.

జాతీయ స్థాయిలో కేసీఆర్ కి ఉన్న ఇమేజ్ ఉద్యమ నేతగా మాత్రమే. ఆయనకు రాజకీయంగా చూస్తే రాష్ట్ర రాజకీయాలకంటే జాతీయ రాజకీయాలపై అవగాహన చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఢిల్లీ వెళ్ళడం కూడా అంత మంచిది కాదు అనే భావన ఆయన పార్టీ నేతలే వ్యక్తం చేసే పరిస్థితి. అది అంతా పక్కన పెట్టేసి రాష్ట్రంలో బిజెపి గురించి మాట్లాడితే తెరాస లో భయం పుట్టే పరిస్థితి ఉంది. ఉంది ఒక ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు అయినా సరే ప్రధాన విపక్షం కాంగ్రెస్ కంటే ఎక్కువ హడావుడి చేస్తుంది.

ఏ మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక లాంటి పరిస్థితులు తెలంగాణాలో వస్తే ఇక్కడ ఉన్న కేటిఅర్ వాటిని ఎదుర్కొని నిలబడటం అనేది చాలా కష్టం. కేటిఅర్ కి పరిపాలనలో ఉన్న అనుభవం రాజకీయంగా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా కేటిఅర్ ని సిఎం చేయాలనుకుంటే చేయండి గాని ఢిల్లీ మాత్రం వద్దు సారూ అని… సలహాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు చేసి, జాతీయ రాజకీయాల్లో ఉన్న శూన్యం పూరించే ప్రయత్నం చేసినా అది విజయవంతం కాకపోవచ్చు.

దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా బిజెపి ఎక్కడ తోక్కేస్తుందో అనే భయంలో చాలా వరకు సైలెంట్ గా ఉన్నాయి. ఎక్కడో తృణముల్ కాంగ్రెస్, కర్ణాటకలో జెడిఎస్, బీహార్ లో ఆర్జెడి, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన మినహా ఏ పార్టీ కూడా ఇప్పుడు బిజెపి తో యుద్దానికి సిద్దంగా లేవు. మిగిలిన పక్షాలు కాంగ్రెస్ తో పూసుకుని తిరుగుతున్నాయి. ఈ పక్షాలతో కూడా కాంగ్రెస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్తే వాళ్ళను ఒక గొడుగు కిందకు తెచ్చి ఆ గొడుగు కేసీఆర్ పట్టుకోవడం అనేది సాధ్యం కాదు.

Read more RELATED
Recommended to you

Latest news