ధరణి పోర్టల్ ద్వారా పల్లెలు చల్లగున్నయ్.. : సీఎం కేసీఆర్

-

నాగర్ కర్నూల్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ BRS ప్రభుత్వం చేసిన ఎన్నో మంచిపనులను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన ఎన్ని ప్రయోజనాలు అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ మాట్లాడుతూ ధరణి రావడం వలన దాదాపుగా 99 శాతం భూ సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయన్నారు. ఏ పధకంలో అయినా కొంతమేరకు సమస్యలు ఉండొచ్చు కానీ ఎక్కువ ప్రయోజనకరంగా మా ధరణి పోర్టల్ ఉందని సంతోషంగా కేసీఆర్ చెప్పారు. నేటి రోజుల్లో పెరిగిన ఈ భూమి ధరలను దృష్టిలో ఉంచుకుంటే పల్లెల్లో ఎన్నో గొడవలు జరిగేవని చెప్పారు, కానీ ధరణి వలన ఇవన్నీ తగ్గిపోయాయన్నారు. ధరణి అన్నది లేకపోతే.. ఎన్ని మర్డర్ లు జరిగిలేవి ? ఎన్ని కేసులు అయ్యేవి ? రోజుకు ఎన్ని పంచాయితీలు జరిగేవి ?

ఈ రోజున అవేమీ లేకుండా పల్లెలు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఈ ధరణి పోర్టల్ ను ఆచరణలో పెట్టడానికి మన పక్క రాష్ట్రము మహారాష్ట్ర రైతులు అడుగుతున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news