ఆయుర్వేదం ప్రకారం ఉదయం ఈ తప్పులని అసలు చేయకండి ఉదయాన్నే ఈ ఆహార పదార్థాలు తీసుకోకూడదని ఆయుర్వేదం అంటుంది. చాలామంది ఈ తప్పులను చేస్తూ ఉంటారు ఉదయం అల్పాహారం సమయంలో ఈ తప్పులు కనుక చేశారంటే ఆరోగ్యం పాడవుతుంది పైకా రకరకాల సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ఏం చెప్తోంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే చాలామంది డ్రింకులు చల్లటి పానీయాలని తీసుకుంటూ ఉంటారు నిజానికి వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యం పాడవుతుంది.
ఉదయాన్నే ఇటువంటివి తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు వస్తాయి కాబట్టి ఉదయం తీసుకోవద్దు. అలానే ఉదయాన్నే ఆయిల్ ఫుడ్స్ ని తీసుకోవద్దు. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ హెవీ ఫుడ్ ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ తగ్గిపోతుంది. తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండ్లని పెరుగుని కలిపి తీసుకోవద్దు. ఉదయాన్నే ఈ రెండిటిని మిక్స్ చేసి తీసుకోవడం వలన సమస్యలు కలుగుతాయి. పచ్చి ఆహార పదార్థాలని కూడా ఉదయాన్నే తీసుకోకూడదు.
చాలా మంది పచ్చి కూరగాయలు వంటి వాటిని ఉదయాన్నే తీసుకుంటూ ఉంటారు చల్లటి పదార్థాలని కూడా తీసుకోవద్దు. ఉదయాన్నే చల్లటి పదార్థాలను తీసుకుంటే కూడా ఆరోగ్యం పాడుతుంది. స్వీట్ ఉండే పదార్థాలని కూడా తీసుకోకండి. ముఖ్యంగా పంచదార బాగా ఎక్కువ ఉండే పేస్ట్రీలు, తియ్యని డ్రింకులు తీసుకోవద్దు వీటిని తీసుకోవడం వలన సమస్యలు కలుగుతాయి.
పచ్చళ్ళు వంటి వాటిని కూడా ఉదయాన్నే తీసుకోకూడదు. ఊరగాయలు వంటి వాటిని ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి సమస్యలు కలుగుతాయి. పెరుగు ఏ కాదు బట్టర్ మిల్క్ ని కూడా ఉదయాన్నే తీసుకోకూడదు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పుల్లటి పండ్లను కూడా ఉదయాన్నే తీసుకోవద్దు. ఆయుర్వేదం ప్రకారం నిపుణులు చెప్పిన విషయాలను చూశారు కదా మరి ఈ తప్పుల్ని చేయకుండా చూసుకోండి లేదంటే ఆరోగ్యం పాడవుతుంది.