పండగ రోజు వాళ్ళ జీవితాలు బంగారం చేసిన కే‌సి‌ఆర్ !!

-

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న రైతులకు కెసిఆర్ ప్రవేశపెట్టిన కొత్త పథకం వారి బతుకులను వెలుగులు నింపుతోంది. మేటర్ లోకి వెళితే వ్యవసాయాన్ని నమ్ముకున్న బ్రతికే రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా కష్టాలు పడకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం 2018వ సంవత్సరం ఆగస్టు 14 తారీకున ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. ఈ పథకానికి 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసు కలిగిన రైతులు ప్రతి ఒక్కరు అర్హులు అని కెసిఆర్ ప్రభుత్వం అప్పట్లో గుర్తించింది.

ఇటువంటి నేపథ్యంలో పథకం అమలులోకి వచ్చిన నాటి నుండి ఎప్పటి వరకు రైతులు ఏదైనా కారణంతో మానేస్తే వారి కుటుంబ సభ్యులకు పదిరోజుల్లో  రూ.5 లక్షలు పరిహారంగా ఎల్‌ఐసీ అందజేస్తున్నది. ఈ పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో మరణించిన దాదాపు 22,583 మంది రైతుల కుటుంబాలకు బీమా సంస్థ రూ.1,129.15 కోట్లు పరిహారంగా చెల్లించింది. మొదటి ఏడాది 2018-19లో 31.86 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.2,271.50 చొప్పున ప్రభుత్వమే దాదాపు రూ.710.58 కోట్లు ప్రీమియంగా చెల్లించింది.

 

తొలి ఏడాదిలో దాదాపు 17,399 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా.. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున దాదాపు రూ. 869.95 కోట్లు బీమా కంపెనీ చెల్లించింది. మరుసటి యేడాది దాదాపు 31.86 లక్షల మంది రైతులకు గ్రూప్‌గా రూ.1,071.79 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5,184 మంది రైతులు వివిధ కారణాలతో మరణించినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. అయితే ఈ ఏడాది పండుగ సందర్భంగా కేసీఆర్ సర్కార్ రైతు భీమా పథకం కింద నమోదైన రైతుల కోసం రైతుల కుటుంబాలకు దాదాపు రూ.259.20 కోట్లు చెల్లించినట్లు ఎల్‌ఐసీ అధికారులు వెల్లడించారు. కచ్చితంగా ఇది కేసిఆర్ తీసుకున్నా నిర్ణయానికి రైతుల బతుకులలో వాళ్ళ జీవితాలలో పండుగ నిలిపే వార్త అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news