రైతులకు కెసిఆర్ గుడ్ న్యూస్…!

-

తెలంగాణా రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇచ్చిన హామీ ప్రకారం రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తీసుకున్న రుణాల్లో బకాయిలు ఉన్న వారికి మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుటుంబానికి రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయనున్నట్టు తెలిపింది.

రూ.25 వేల లోపు రుణం ఉన్న వారికి ఒకే దఫాలో మాఫీ చేస్తారు. రూ.లక్ష వరకు రుణం ఉన్న వారికి నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని పేర్కొంది. చెక్కుల ద్వారా రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది. స్వయంగా ఎమ్మెల్యేలు రుణమాఫీ చెక్ లను రైతులకు అందిస్తారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ… ఆర్థిక లోటు ఉన్నా సరే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సాగునీటి ప్రాజెక్ట్ ల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక రైతులకు ఆర్ధిక సహాయ౦ చేయడానికి గాను రైతు బంధు కార్యక్రమం ప్రకటించింది. రైతు కార్యక్రమాల కోసం భారీగా నిధులు కేటాయిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news