రైతులకి శుభవార్త చెప్పిన కేసీఆర్

-

మొక్కజొన్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మొక్క జొన్నలను కూడా మద్దుతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్‌. క్వింటాలు మక్కలకు 1,850రూపాయల ధర చెల్లిస్తామన్న ఆయన మార్క్‌ ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ గ్రామాల్లోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారు కాబట్టి ప్రభుత్వానికి ప్రస్తుతానికి కొనుగోలు చేసే బాధ్యత లేదని అయితే రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news