కెసిఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్రంలో రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో… తెలంగాణ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీబీఐ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో సీబీఐకి గతంలో దర్యాప్తు కోసం ఇచ్చిన అనుమతి ఉపసంహరించుకుంది సర్కార్. ఆగస్ట్ 30, 2022న తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొంది. జీఓ నెంబర్ 51 ద్వారా తాజాగా ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ సర్కారు ఉత్తర్వులు… జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం… రాష్ట్రంలో సీబీఐ దాడులు అసలు జరగవు అన్నమాట. కెసిఆర్ ప్రభుత్వం అనుమతి లేనిదే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగదు.