ట్రంప్ తో విందుకి కెసిఆర్ కి ఆహ్వానం…!

-

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విందుకి ఆహ్వానం వచ్చింది. ట్రంప్ భారత పర్యటన నేపధ్యంలో భారత రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ ఈ నెల 25 న ఒక విందు ఇవ్వనున్నారు. ఈ విందుకి హాజరు కావాలీ అంటూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోవింద్ నుంచి ఆహ్వానాలు వెళ్ళాయి. తెలంగాణా, మహారాష్ట్ర, హరియాణా, బీహార్, ఓడిస్సా, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి మాత్రం ఆహ్వానం అందలేదు. ఈ కార్యక్రమానికి కేవలం 90 నుంచి 95 మంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక ఆయన కుమార్తె ఇవాంకా తో మాత్రం ట్రంప్ రెండో సారి సమావేశం అవుతారు. 2017 చివర్లో ఒకసారి ఆమెతో ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన విందులో కెసిఆర్ పాల్గొన్నారు.

అప్పుడు కెసిఆర్ విందుకి ఆశ్చర్యపోయిన ఇవాంకా, అమెరికా వెళ్ళిన తర్వాత ఒక లేఖ కూడా రాసారు. ఇక ఇదిలా ఉంటే ట్రంప్ పర్యటన నేపధ్యంలో అమెరికా అధికారులు భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా అంతా తామే స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వైట్ హౌస్ కి చెందిన వంద మంది అధికారులు భారత్ లో దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news