తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకప్పుడు ఒంటి చేత్తో శాసించిన కేసీఆర్(KCR) ఇప్పుడు కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆయన ఎవరెన్ని మాట్లాడినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఒర నిరసనల్లాంటివి ఎన్ని చేసినా వాటిని విచ్ఛిన్నం చేసి తనకు ఎదురే లేదని నిరూపించుకున్నారు కేసీఆర్.
అదేంటో గానీ ఆయన ఇప్పుడు ఎవరేం అజెండా ఎత్తుకున్నా దానిపై దానికి ఇట్టే స్పందిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో పనిపై ఆయన ముందస్తు భయంతోనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే ఎప్పటి నుంచో రాష్ట్రంలో డిమాండ్ లో ఉన్న జాబ్స్ నోటిఫికేషన్ సమస్య.
దీనిపై ఇప్పుడు బీజేపీ నాయకులు ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. అలాగే కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల అయితే మొదటి నుంచే నిరుద్యోగ ఎజెండాను మోస్తున్నారు. వీరికి తోడు తానేం తక్కువ కాదంటూ టీ కాంగ్రెస్‌కు కొత్తగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి కూడా నిరసనలకు దిగుతానని ప్రకటించాడు. దీంతో కేసీఆర్ అలర్ట్ అయి ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతోంది. మొత్తానికి కేసీఆర ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా భయపడుతున్నట్టు తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.