నిరుద్యోగులకు శుభవార్త.. రెండుమూడు నెలల్లో రిక్రూట్ మెంట్ స్టార్ట్ చేస్తాం- సీఎం కేసీఆర్

-

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. నిరుద్యోగులు ఎన్నాళ్ల నుంచో ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొత్తగా తీసుకువచ్చిన జోనల్ విధానంతో 95 శాతం స్థానికులకే దక్కుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఆయా జిల్లాల స్థానికులకే అవకాశం లభిస్తుందని వెల్లడించారు.

KCR-TRS

ప్రస్తుత జోనల్ విధానంతో రాబోయే నెల రోజుల్లో ఉద్యోగుల విభజన జరిగిపోతుందని అన్నారు. ఆ తర్వాత ఏ జిల్లా వాళ్లకు అక్కడి ఉద్యోగులతో ఉద్యోగాలు భర్తీ జరుగుతుంది. దీని తర్వాత ఏజిల్లాకు ఎన్నిజాబులు వస్తున్నామనే వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. ఖాళీల సమాచారం కూడా వెల్లడవుతుందని అన్నారు. ఒకసారి లెక్కతేలిన తర్వాత రెండు  మూడు నెలల్లో ఉద్యోగ భర్తీ ప్రారంభిస్తామన్నారు. కనీసం 70-80వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news