తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ ఏది చెప్పినా అది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమే. ఎందుకంటే కేసీఆర్ మాటల్లోనే చాలా అర్థం ఉండేదని అంతా అనుకునేవారు. ఆయన అంతలా చెప్తున్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండేదని అంతా అనుకునేవారు. కేసీఆర్ తన మాటలతోనే తెలంగాణ రాకముందు, వచ్చిన తొలి ప్రభుత్వంలో కూడా రాజకీయాలు చేశారు. కానీ ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చాక రూటు మార్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన రెండోసారి సీఎంగా వ్యవహరిస్తున్న సమయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.
అసలు వాస్తవానికి రాజకీయాల్లో కేసీఆర్ కు మంచి వ్యూహకర్తగా, రాజకీయ దిట్టగా పేరుందనే చెప్పాలి. అయితే ఆయన రెండో సారి సీఎం సీటుపై కూర్చున్న తర్వాత ఇంకా కూడా మాటలతో రాజకీయాలు చేయలేమని ఆయనకు అర్థమైపోయినట్టుంది. అందుకే ప్రతిసారి లాగా కాకుండా ఈ సారి వస్తున్న ప్రతి ఎన్నికల్లో కూడా ఆయన ఇప్పుడు ఏదైనా స్కీమ్ లేదంటే డబ్బు పరమైన రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆయన ఇలా చేయడం మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఒక ఉద్యమ పంతా నుంచి వచ్చి నేత ఇలా డబ్బు రాజకీయాలను నమ్ముకోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక రాజకీయాల్లో ఇలాంటివి కామనే అయినప్పటికీ కూడా కేసీఆర్ మొదటి నుంచి ఇలాగే ఉంటే అది పెద్ద విషయం కాదనే చెప్పాలి. కానీ ఇలా అనూహ్యంగా ఒక్క అధికారం ఉంటే చాలు అనేంతలా ఆయన రాజకీయాలను ఆపత్కాల స్కీమ్‌లు లేదంటే డబ్బులు అనేంతలా చేస్తున్నారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలను చూస్తేనే ఆ విషయం కాస్త అర్థమవుతుంది. అవతలి వ్యక్తిని ఓడించేందుకు ఏకంగా దళితబంధు లాంటి పథకాన్ని తీసుకొస్తున్నారంటేనే ఆయన ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.