బ్రేకింగ్; తెలంగాణాలో 5 కొత్త కేసులు; కెసిఆర్

-

జనతా కర్ఫ్యూ చాలా అద్భుతంగా జరిగిందని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జనతా కర్ఫ్యూ కి ప్రజలు అందరూ సహకరించారని అన్నారు. చాలా అద్భుతంగా కర్ఫ్యూజరిగిందని వ్యాఖ్యానించారు. ప్రపంచానికే తెలంగాణా ఆదర్శంగా నిలిచింది అన్నారు. దురదృష్టవ శాత్తు ఇవాళ అయిదు కొత్త కేసులు నమోదు అయ్యాయని అన్నారు.

కర్ఫ్యూ కి ప్రజలు చాలా చక్కగా స్పందించారని అన్నారు. తెలంగాణాలో 5 కరోనా కేసులతో మొత్తం 26 కి చేరాయని అన్నారు. ప్రతీ ఒక్క తెలంగాణా బిడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా అన్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం అయి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఇవాళ నుంచి విదేశాలకు విమానం బంద్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని ఆపెసినట్టు వివరించారు. సంఘీభావ సంకేతాన్ని కూడా అద్భుతంగా చేసారని కొనియాడారు.

ఈ నెల 31 వరకు తెలంగాణాలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని అన్నారు. రేషన్ కార్డ్ ఉన్న కుటుంబాలు అన్నింటికీ నెలకు 1500 ఇస్తామని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుందని చెప్పారు. ఐదుగురు మించి ప్రజలు ఎవరూ గుమి కూడవద్దని కెసిఆర్ కోరారు. మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ ఆంక్షలు తప్పవని అన్నారు. ఇంటర్ పరిక్షా పత్రాల మూల్యాంకనం మార్చ్ 31 వరకు ఆపెసామని అన్నారు.

87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుల దారులకు నెలకు 12 కేజీల రేషన్ ఇస్తామని చెప్పారు. అత్యవసర ఉద్యోగులు మినహా 20 శాతం ఉద్యోగులు మాత్రమే హాజరు కావాలని కెసిఆర్ సూచించారు. ఈ నెలలో కాన్పులు అయ్యే వారి వివరాలు కోరామని కెసిఆర్ వివరించారు. వాళ్ళు అందరికి ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు అన్నీ కూడా 31 వరకు బంద్ అన్నారు.

పేదలకు రెక్కాడితే గాని డొక్క ఆడదాని కెసిఆర్ అన్నారు. ఎవరూ కూడా ఆకలికి గురి కావోద్దని, అందరికి రేషన్ ఇస్తామని చెప్పారు. అత్యవసర సరుకుల కోసం ఇళ్ళ నుంచి ఒక్కరు మినహా ఎవరూ బయటకు రావొద్దని అన్నారు. విద్యా కార్యాకలాపాలు అన్నీ కూడా బంద్ అన్నారు. ఆటో, బస్సులు, క్యాబులు ఏవీ బయటకు రావొద్దని ఆయన కోరారు. అన్ని సరిహద్దులను మూసి వేస్తున్నామని స్పష్టం చేసారు.

నిత్యావసర సరుకుల కోసం ఒక్కరు మినహా ఎవరూ బయటకు రావొద్దని, లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిందే అని స్పష్టం చేసారు. అత్యవసరం కోసం 1314 కోట్లు విడుదల చేస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అత్యవసర సరుకులు మినహా ఏమీ కూడా అనుమతించేది లేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో ఉండి వర్క్ చేయవచ్చు అని సూచించారు.

ప్రజా రవాణాను పూర్తిగా ఆపెస్తున్నాని స్పష్టం చేసారు. మూడు లక్షల 36 వేల టన్నుల బియ్యం పంపిణి చేస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని కెసిఆర్ ఆదేశించారు. ఇటలీ బాగా ఇబ్బంది పడుతుందని, అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే బయటకు రావొద్దని కోరారు. అత్యవసరం కాని సర్జరీలు అన్నీ కూడా వాయిదా వేస్తున్నామని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారు అందరూ కూడా లొంగిపోవాలని సూచించారు. ప్రపంచం మొత్తం భయంకరంగా ఉందని, కాబట్టి అందరూ ఆషామాషీగా తీసుకోవద్దని సూచించారు. ఒక వారం కంట్రోల్ లో ఉంటే జీవితం కాపాడుతుందని కెసిఆర్ సూచించారు. ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా అని అందరూ ఇళ్ళకే పరిమితం కావాలని అన్నారు. అత్యవసర వాహనాలు మినహా ఏమీ తిరగవని స్పష్టం చేసారు.

తెలంగాణా లో ఆరు వేల బృందాలు పని చేస్తున్నాయని కెసిఆర్ అన్నారు. ప్రపంచంలోనే తెలంగాణా ప్రభుత్వం చాలా బాగా పని చేస్తుందని కెసిఆర్ అన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడటానికి అందరూ ముందుకి రావాలని కెసిఆర్ కోరారు. దయచేసి అందరూ బయటకు రాకుండా ఇళ్ళల్లో పనులు పూర్తి చేసుకోవచ్చు అన్నారు. అత్యవసర సరుకులు దొరుకుతాయని కెసిఆర్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news