మామిడి రైతుల కోసం కేసీఆర్ సర్కార్ ఆలోచన సూపర్ సక్సెస్

-

మామిడి రైతులకు అండగా నిలవడానికి గానూ తెలంగాణా ఉద్యానవన శాఖ మొదలు పెట్టిన కార్యక్రమం విజయవంతం అయింది. ఆన్లైన్ ద్వారా మామిడి పండ్లను విక్రయించడానికి గానూ వాట్సాప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనితో పండ్లు కావాలి అనుకున్న వినియోగదారులు అందరూ ఆర్డర్ చేస్తున్నారు. దీనిపై తెలంగాణా ఉద్యాన వన శాఖ కమీషనర్ వెంకట్రాం రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఉద్యాన శాఖ ద్వారా పంపిణీ చేయతలపెట్టిన మామిడి పళ్లను ఈ నెల ఐదో తేదీ నుంచి కస్టమర్ల ఇంటికే డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభించామన్న ఆయన… రెండు రోజుల్లో నే 2,500 కిలోలకు ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ఫోన్‌ నెంబర్లతో అసౌకర్యం కలుగుతున్న కారణంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామన్నారు.

పోస్టల్‌ శాఖ పార్సిల్‌ ద్వారా మామిడిపళ్లను వినియోగదారుల ఇంటికి చేర్చుతామని ఆయన వివరించారు. వినియోగదారులు నేరుగా కొనుగోలు చేసేందుకు వీలుగా పబ్లిక్‌ గార్డెన్స్‌, జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రోజుకు కనీసం పది టన్నుల మామిడి పళ్లు పంపిణీ చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఫోన్‌, ఆన్‌లైన్‌ బుకింగ్‌ సీరియల్‌ ప్రకారం మామిడి పళ్ల డెలివరీ జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news