రాలిపోతున్న గబ్బిలాలు.. వణికిపోతున్న జనాలు!

-

కరోనాకి సంబందించిన ఏ పేరు వినిపించినా జనాలు వణికిపోతున్న రోజులివి. కరోనా విషయంలో దున్నపోతు ఈనింది అంటే దూడను తీసుకెళ్లి కట్టెయ్యి అనేటంత దారుణంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పైగా కరోనా వైరస్ రావడానికి గబ్బిలాలు కారణం అని ఒక నెపం వాటిపై వేయడంతో… ఇక వాటికి సంబందించిన వార్త వస్తే చాలు వణికి పోతున్నారు… అవి కనిపిస్తే చాలు కాల్చి పాడేస్తున్నారు! ప్రస్తుతం చాలా గ్రామాల్లో పరిస్థితి ఇలానే ఉంది! ఇలాంటి సంఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది!

ఉత్తర ప్రదేశ్ లోలో మీరట్ లో లోని ఓ చెరువు సమీపంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చనిపోయి కనిపించాయి. దీంతో ఆ గ్రామప్రజలు అటువైపు వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేక భయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ విషయం గురించి అధికారులకు సమాచారం చేరటంతో అటవీ శాఖ అధికారులు పశువైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. చనిపోయిన గబ్బిలాలను పోస్టుమార్టం కోసం తరలించారు. అసలు ఈ గబ్బిలాలు వాటికి అవే చనిపోయాయా లేక ఎవరైనా మందు పెట్టి చంపేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారంట.

ఆ సంగతులు అలా ఉంటే… ఇదే మీరట్ లోని గంగానగర్ లో కొందరు కరోనాకు భయపడి గబ్బిలాలను నాటు తుపాకులతో కాల్చి చంపేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వరుసగా రెండు మూడు రోజులుగా గబ్బిలాలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయని గ్రామస్తులు వాపోతుండటం చూసిన అధికారులు కాస్త వాకబు చేయగా… కావాలనే వాటిని నాటు తుపాకులతో కాల్చి చంపేస్తున్నట్లు గుర్తించారట. ఇదే క్రమంలో ఈ తాజా సంఘటనలో కూడా ఎవరైనా వాటిని కావాలనే చంపేస్తున్నారా..? లేక.. పొలాల్లో చల్లే పురుగు మందు కారణంగా చనిపోయాయా…? లేక… జనాలను భయబ్రాంతులకు గురిచేయడానికి ఆకతాయిలు చేస్తున్న పనులా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారట!

Read more RELATED
Recommended to you

Latest news