మహిళల రక్షణకు కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఈ నెంబర్ కు SMS చేస్తే రంగంలోకి పోలీసులు

-

మహిళల భద్రత కోసం కేసీఆర్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతి లో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మహిళలు, యువతుల రక్షణ కోసం మహిళా కమిషన్ అందుబాటులోకి తీసుకు వచ్చిన వాట్సాప్ నెంబర్ 9490555533 ను ఆమె ప్రారంభించారు.

ఈ నెంబర్ను ప్రతి పాఠశాల, కళాశాల అలా యూనివర్సిటీ గోడలపై రాయిస్తామని ప్రకటించారు. ఆపదలో ఉన్న ఎవరైనా ఈ నెంబరు కు మెసేజ్ పంపిస్తే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రక్షణ కల్పిస్తారని ఆమె ప్రకటించారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని.. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో- కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల భద్రత పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి- షీ టీమ్స్ ఏర్పాటు చేశారని.. పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారన్నారు.NRI వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక NRI సెల్ సీఎం ఏర్పాటు చేశారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news