కేసీఆర్ మార్క్ వైద్యం ఇది

-

వచ్చే ఎన్నికల్లో సిఎం కేసీఆర్ అనుసరించే వ్యూహాలపై ఇప్పుడు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కాస్త వినూత్నంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు. అందుకే కొంత మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టడానికి సీఎం రెడీగా ఉన్నారని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది.

అందుకే త్వరలోనే కొంత మంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కీలక నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గ బాధ్యులను కూడా ప్రకటించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని వార్తలు వినపడుతున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో మీరు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కాబట్టి ఇప్పుడు కష్టపడాలి అని వాళ్లకు సీఎం కేసీఆర్ చెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఉండకుండా హైదరాబాదులో కాలక్షేపం చేస్తున్నారని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. వాళ్ల విషయంలో ఇప్పటి నుంచే ఒక నిర్ణయం తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉండవచ్చు. చాలామంది మంత్రులు కూడా పనిచేయకపోవడంతో వాళ్ళ నియోజకవర్గాలకు కూడా మరో నేతను ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news