ప్రాణయామ ఆసనాలతో వేసవి తాపాన్ని తగ్గించుకోండిలా..!

యోగ చేయడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక వేసవి వచ్చిందంటే చాలు భానుడు భగభగ మండిపోతూ ఉంటాడు. ఇక వేసవిలో ఉష్ణోగ్రత్తలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంటాయి. ఇక చాల మందికి వడదెబ్బ, నీరసం వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కవగా ఉంటుంది. అయితే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వేసవి కాలంలో చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

yoga
yoga

అయితే పోరాడటానికి యోగా నిజంగా సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాణాయామాలు చేస్తే ఎండ వేడిమి నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. మీరు రోజులో ఎప్పుడైనా వీటిని ప్రాక్టీస్ చేయవచ్చు. అవి మీరు ఆఫీసులో పని చేస్తున్నా చేసుకోవచ్చు. ఇంట్లో టీవీ చూస్తూ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు ప్రాణాయామ పద్ధతులు శరీరాన్ని చల్లబరిచి రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడతాయి. అందులో ఒకటి శీతలీకరణ ప్రాణాయామం.

ఇక ఇది ఒక రకమైన శ్వాస ప్రక్రియ. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ ప్రాణాయామం చల్లదనం కలుగజేస్తుంది కాబట్టి దీనికి శీతలి అని పేరు వచ్చింది. యోగా మ్యాట్ కానీ మరేదైనా కానీ వేసుకుని పద్మాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోవాలి. చేతులు రెండూ మోకాళ్ల మీద ఉంచి రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఇప్పుడు మీ నాలుకను ఒక ట్యూబ్ మాదిరిగా చేసి దాని ద్వారా లోపలికి గాలిని పీల్చాలి. అలా పీల్చిన గాలిని లోపల ఉంచి నోరు మూసెయ్యాలి. ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలివేయబడుతుంది. ఇలా రోజులో 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. దీనిని నడుస్తూ, నిలబడి, కూర్చుని ఎలాగైనా సాధన చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు.. వేసవిలో ప్రతి రోజూ శీతలీ ప్రాణాయామం చేయడం వల్ల వేడిని తట్టుకునే శక్తి వస్తుంది. వడదెబ్బ నుండి కాపాడుతుంది. ఆకలి, దప్పికలు అదుపులో ఉంటాయి. వేసవిలో వేడి చేయటం, జ్వరం, అలసట, బద్దకం, నిద్రమత్తుని తగ్గిస్తుంది.