ఒక్క వాట్సాప్ మెసేజ్ తోనే ఇంటికి సరుకులు

లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నేరుగా ఇంటికే సరుకులు వచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మీ ప్రాంతానికి దగ్గరోలో ఉన్న సూపర్ మార్కెట్ల వాట్సాప్ నెంబర్లను ప్రజలకు ప్రభుత్వం తెలియజేస్తుంది. సూపర్ మార్కెట్ల వాట్సాప్ నెంబర్ కు సరుకుల వివరాలతో పాటు అడ్రస్ పంపితే నేరుగా ఇంటికే సరుకులు వచ్చేస్తాయి. సరుకులు ఇంటికి వచ్చిన తర్వాతే డబ్బులు చెల్లించవచ్చు. కానీ దీని కోసం కనీసం వెయ్యి రూపాయల విలువ చేసే సరుకులు కొనాల్సి ఉంటుంది.

లాక్ డౌన్ లో ప్రజలకు అవసరమయ్యేలా అనేక చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి.  ఇప్పటికే మూడు నెలల పాటు ఈఎమ్ఐ కట్టనక్కర్లేదని కేంద్ర ప్రకటించింది. ఫ్రీగా రేషన్ అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలను కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. అయినా కానీ చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా  ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇళ్ళ వద్దే ఉండాలని కోరుతున్నారు.