ఆదివాసీలకు KCR క్షమాపణ చెప్పాలి – వైఎస్ షర్మిల

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 223వ రోజు జనగామ నియోజకవర్గం నర్మేట మండలం ఆగపేట్ నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్ర నేడు నర్మెట, మరియాపురం, అక్కేరాజపల్లి, తరిగొప్పుల, సోలి పురం గ్రామాల మీదుగా సాగనుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివాసీలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.

ఆదివాసీలు అడవుల దురాక్రమణ చేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడడం దారుణం అని అన్నారు. ఓట్ల కోసం నాడు ఆరు నెలల్లో పట్టాలిస్తామని, కుర్చీ వేసుకుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి.. నేడు మాట మార్చడం సిగ్గుచేటని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఆదివాసీలకు క్షమాపణ చెప్పి షరతులు లేకుండా పోడుపట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news