ఇబ్రహీంపట్నం: ‘‘తొడలు కొట్టడమెందుకు..?ఆ తర్వాత వెనక్కి పారిపోవడం ఎందుకు?’’

-

అర్ధరాత్రి ఎన్నికలు పెట్టినా రెడీ’ అన్నావాళ్లు… తీరా అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఎన్నికలు వద్దంటూ తోక ముడచడంతో పాటు… మర్రి శశిధర్‌రెడ్డిలాంటి నాయకుడు 10-15కేసులు వేయడం దేనికి చిహ్నం అన్నారు. ఇక కొంతమంది అత్యుత్సాహంతో తొడలు కొట్టడలు కొట్టారు అంటూ విమర్శించారు. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలో జరిగిన తెరాస ప్రజాశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ… ‘‘ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. ఇది సహజంగా జరిగే పరిణామం. ఏ పార్టీ చెప్పినా వినండి.. ఇంటికి వెళ్లాక చర్చ చేయండి. వివేచన, ఆలోచనతో ఓట్లు వేయాలి అంటూ కోరారు.

58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, తెదేపా ఒక కూటమి, 15ఏళ్లు ఉద్యమం చేసిన తెరాస ఒక వైపు. ఎవరు గెలిస్తే మంచిదో మీరు ఆలోచించాలి. కాంగ్రెస్‌ హయాంలో ఏనాడైనా సరిగ్గా విద్యుత్‌ ఇచ్చారా..? చంద్రబాబు ఉన్నప్పుడు కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారు..? దేశ సగటు కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. 40 ఏళ్ల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. అన్నీ చూశా. అమ్మాయి పెళ్లి జరిగితే రూ.లక్ష ఏ రాష్ట్రమూ ఇవ్వలేదు.

సోనిమా గాంధీ కడుపు ఎందుకు తరుక్కుపోతుంది..

ఈ మధ్య తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది అంటూ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 24 గంటల   పాటు కరెంటు ఇస్తుంన్నందుకా..రైతులకు అందిస్తున్న పథకాలు, రైతు బంధు లాంటి సంక్షేమా కార్యక్రమాలను చూసి ఆమెకు కడపు తరుక్కుపోతుందేమో అంటూ వ్యాగ్యంగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news