మహారాష్ట్రలోని పూణెలో రోడ్ల మీద ఉమ్మేస్తే.. ఉమ్మేసిన వాళ్లతోనే ఉమ్మి కడిగించే పద్ధతిని తెర మీదికి తీసుకొచ్చింది పూణె మున్సిపల్ కార్పొరేషన్. దానిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా బహిరంగ ఉమ్మివేతపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి కోల్‌కతాలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే లక్ష రూపాయల ఫైన్ సమర్పించాల్సిందే. తక్కువ ఫైన్ పెట్టినా.. ప్రజల్లో పెద్దగా మార్పు రాలేదని.. ఏకంగా ఫైన్‌ను లక్ష రూపాయలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.
నిజానికి.. కోల్‌కతాలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా మారుతోంది. ఎక్కడ చూసినా ఉమ్మి, పాన్ మరకలు, చెత్త చెదారంతో ఉండటంతో.. ఉమ్మేయడంపై ఫైన్‌ను పెంచింది ప్రభుత్వం. ఇదివరకు ఉమ్మేస్తే 50 నుంచి 5 వేల రూపాయల వరకు జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని గరిష్టంగా లక్ష రూపాయలకు పెంచారు.