నేడు 8 సభల్లో కేసీఆర్…

-

తెలంగాణ  ఎన్నికల ప్రచారంలో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న కేసీఆర్ నేడు రాష్ట్రంలోని 8 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.  కల్వకుర్తి, మహబూబ్ నగర్, కొల్హాపూర్, అచ్చంపేట, వనపర్తి, హాలియా, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తెరాస ప్రభుత్వం సాధించిన పురోగతిని, రాబోయే రోజుల్లో చేసే పనుల గురించి వివరించనున్నారు. ఇప్పటికే పలు సభల్లో ప్రజాకూటమి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఆయన  మరోసారి ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టనున్నారు. తెదేపా – కాంగ్రెస్ అనైతిక పొత్తుతో పాటు కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news