ఇక నుంచి ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు నో హోమ్ వర్క్..!

-

No Homework For Classes 1-2 MHRD guidelines

ఎప్పుడైనా పాఠశాల విద్యార్థులు స్కూల్ కు వెళ్తుంటే చూశారా? వాళ్ల వెనుక బ్యాగులు చూశారా? వాటిని మోయలేక మోయలేక మోసుకుంటూ వెళ్తుంటారు. దాన్ని మోసుకుంటూ స్కూల్ కు వెళ్లడమే వాళ్లకు పెద్ద సవాల్. రోజూ ఇంటి నుంచి స్కూల్ కు, స్కూల్ నుంచి ఇంటికి ఇలా.. రోజూ చాంతాడంత బ్యాగు తగిలించుకొని విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. అందుకే.. విద్యార్థుల బ్యాగ్ సైజుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర హెచ్ఆర్డీ మినిస్ట్రీ బ్యాగు బరువుపై మార్గదర్శకాలను నిర్దేశించింది.

వాటిలో అతి ముఖ్యమైనది… ఒకటి, రెండో క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. అంతే కాదు.. వీళ్లకు లాంగ్వేజ్, మ్యాథ్స్ తప్పించి మిగితా ఏ సబ్జెక్ట్ చెప్పకూడదు. 3 నుంచి 5 వ తరగతి స్టూడెంట్స్ కు లాంగ్వేజ్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మాత్రమే బోధించాలి.

ఫస్ట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ బ్యాగు బరువు 1.5 కిలోలకు మించరాదు. 3 నుంచి 5 వ క్లాస్ విద్యార్థుల బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలు మాత్రమే ఉండాలి. 6,7 వ క్లాస్ స్టూడెంట్స్ బ్యాగు బరువు 4 కిలోలకు మించరాదు. 8, 9 వ తరగతి స్టూడెంట్స్ బరువు 4.5 కిలోలు, 10 వ క్లాస్ స్టూడెంట్స్ బ్యాగు బరువు 5 కిలోల కంటే ఎక్కువగా ఉండరాదు.

2015లోనే స్కూల్ బ్యాగుల బరువును తగ్గించాలంటూ కేంద్రం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 2016లో సీబీఎస్ఈ కూడా స్కూల్ బ్యాగుల వెయిట్ పై తన అఫీలియేటెడ్ స్కూల్స్ కు నిబంధనలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news