ఢిల్లీలో ధర్నా చేస్తా.. స్వయంగా నేనే పాల్గొంటా- కేసీఆర్

-

రైతుల్ని కేంద్రం ముంచేస్తుంది. కేంద్రం తీసుకు వచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఉత్తర భారత దేశంలో రైతులు చేస్తున్న ఆందోళనక మద్దతుగా ధర్నా చేస్తాం. రైతుల కోసం ఎంతకైనా పోరాడుతాం. రైతుల ధాన్యం సేకరించడానికి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాం… ముఖ్యమంత్రిగా నేను కూడా ధర్నాలో పాల్గొంటా… అని కేసీఆర్ కేంద్రాన్నిహెచ్చిరించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, సహకారసంఘాల చైర్మల్ అందరితో కలిసి ఢిల్లీ దద్దరిల్లేలా ధర్నా చేస్తామన్నారు.kcr తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయవద్దని అన్నారు. పార్లమెంట్ లో ధాన్యం కొనుగోలు అంశంపై గళమెత్తుతామన్నారు. పంజాబ్ లో పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కేంద్రం సేకరిస్తుందని.. తెలంగాణ రైతుల ధాన్యాన్ని ఎందుకు కొనరో తేల్చుకుందాం అని తీవ్ర స్థాయిలో కేంద్రం తీరును విమర్శించారు. రైతాంగం బతుకుతో బీజేపీ చలగాలం ఆడుతుంది.. రైతుల్ని మునిగిపోవద్దని వారిని కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అని.. రైతులను ఆగం చేస్తే కేసీఆర్ చూస్తూ ఊరుకుంటాడా..అని తీవ్ర స్థాయిలో కేసీఆర్ బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news