కిషన్ రెడ్డి జాగ్రత్త… కెసిఆర్ వార్నింగ్…!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కిషన్ రెడ్డి జాగ్రత్త …కేంద్ర హోంమంత్రి హోదాలో మాట్లాడాలని అన్నారు. నేను కూడా కేంద్ర మంత్రిగా పని చేశానని కేసీఆర్ తెలిపారు. హుజురాబాద్ లో మీరు చేసిన తప్పుడు ఆరోపణలపై ఆధారాలు ఉన్నాయా అంటూ కిషన్ రెడ్డిని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ తో పాటు అందరం వెళ్లి ధర్నా చేస్తామని వ్యాఖ్యానించారు. కేంద్రం తెలంగాణ ధాన్యం ఎందుకు సేకరించదని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణా దేశానికి అన్నం పెడుతోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 110 ఎమ్మెల్యేలు మిత్ర పక్షాలతో కలిసి ఉన్నామని అన్నారు.kcr

అందరం కలిసి ఉరికించి కొడతాం అంటూ కెసిఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయొద్దు అని అన్నారు. ప్రాజెక్ట్స్ లో ఎక్కడ అవినీతి జరిగిందో కేసు పెట్టాలని అన్నారు. కుక్కలు మొరిగినట్లు మోరుగుతున్నారు అంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. నువ్వు మనిషివైతే ఢిల్లీకి వెళ్లి ఆర్డర్ తీసుకురా అంటూ బండి సంజయ్ పై ఫైరయ్యారు. అల్లాటప్ప మాటలు వింటే రైతులు దెబ్బతింటాయని కేసీఆర్ అన్నారు. బిజెపి రైతులను మోసం చేస్తోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.