అంతా ఏకం కావాలి….కేసీఆర్

-


జాతీయ స్థాయిలో రాజకీయాల్లో పెను మార్పులను చోటు చేసుకునే విధంగా తెరాస అధినేత రాజకీయ వ్యూహాన్ని అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కోల్‌కతాలో సోమవారం  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించుకున్న ఇరువురు  సమావేశం అనంతరం మీడియాతో వారి అభిప్రాయాలను పంచుకున్నారు…

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోని రాష్ట్రాల పరిస్థితి మెరుగుపడదలంటే దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నారు.  కేంద్ర ప్రభుత్వాన్ని అదుపులో పెట్టేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలోనే పటిష్ట, పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకొస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఫెడరల్‌ ఫ్రంట్ ఏర్పాటు అంటే ఆదర బాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  ఫెడరల్ ఫ్రెంట్ పై ఇప్పుడిప్పుడే కాస్త హోంవర్క్ చేస్తున్నామన్నారు. ఫ్రంట్ ఆవశ్యకత, రాష్ట్రాల రాజకీయ పార్టీల పరిస్థితులు ఇతర అంశాలను అన్నింటిని పరిగణంలోకి తీసుకుని నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news