ఇండోనేషియాను సునామీ అతలాకుతలం చేసింది. 300 మందిని దాకా పొట్టనపెట్టుకున్నది. వీకెండ్‌లో ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వచ్చిన వారిని చంపేసింది. క్రకటోవా అగ్నిపర్వతం పేలిపోవడంతో సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో సునామీ ఏర్పడింది. దాదాపు 20 అడుగుల ఎత్తులో తీరం వైపు రాకాసి అలలు ఎగసి పడి బీచ్‌లు, రెస్టారెంట్లను తుడిచిపెట్టేశాయి. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాల మధ్య ఉన్న క్రకటోవా అగ్నిపర్వతం పేలిపోవడంతో దాని ద్వారా వచ్చిన సునామీ బీభత్సం సృష్టించింది. సుందా జలసంధి ప్రాంతంలో అలలు ఎగిసిపడటంతో క్షణాల్లో ఆ ప్రాంతం అంతా అంధకారం అయిపోయింది.
అయితే.. నిప్పులు చిమ్ముతూ పేలిపోయిన అగ్నిపర్వతం తాలుకూ దృశ్యాలను హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించారు. అగ్నిపర్వతం పేలుతున్నప్పుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(Video Courtesy: Hindustan Times)