తెలంగాణాలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు తెలంగాణాలో కరోనా వైరస్ బ్రతకదని శాసన సభ సాక్షిగా ఆయన స్పష్టం చేసారు. కరోనా బ్రతకాలి అంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండాలని 22 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే అసలు బ్రతికే అవకాశమే లేదని, ఆయన అన్నారు. కరోనాపై ఏ విధమైన అపోహలు వద్దని అసలు రాష్ట్రంలో ఆ రోగం ఎవరికి లేదని అన్నారు.
వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే కరోనా రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటామని కెసిఆర్ స్పష్టం చేసారు. తెలంగాణాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని అన్నారు ఆయన. అసలు కరోనా నే లేనప్పుడు మాస్కులు ఎందుకు అని కెసిఆర్ ప్రశ్నించారు. నిజంగా కరోనా వస్తే మాస్కులు లేకుండా పని చేస్తామని కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
గాంధి ఆస్పత్రిలో కరోనా వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నారు అని కెసిఆర్ అన్నారు. కరోనా వచ్చిన వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడు గాని ఇక్కడ ఆ వైరస్ లేదని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వస్తుందన్నారు. వెయ్యి కోట్లు ఖర్చు చేసి అయినా సరే కరోనా బ్రతకకుండా చేస్తామని స్పష్టం చేసారు. ప్రభుత్వం కరోనా రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంది అని కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్చగా ఉండవచ్చని అన్నారు.