మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు.. కెసిఆర్ అవినీతి సొమ్మంతా మెగా కృష్ణారెడ్డి చేతుల్లో ఉందన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. రూల్స్ కి విరుద్ధంగా బ్లాస్టింగ్ ల వల్లే పంపు హౌస్ లు మునిగాయని.. మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అంటూ ట్వీట్ చేశారు వైయస్ షర్మిల.”మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది.
అందుకే మేఘా కంపెనీ పంపు హౌస్ లు మునిగినా, ప్రాణాలు తీసినా, గుట్టలు కొల్లగొట్టి మట్టిని ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించినా, రూల్స్ కు విరుద్ధంగా చేసిన బ్లాస్టింగ్ ల వల్లే పంపుహౌస్ లు మునిగినా.. అవి దొర కమీషన్లు పెంచుకోవడానికి పనికొస్తాయి తప్పితే మేఘా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి పనికిరావు. దొంగలకు సద్ది కట్టినట్టు కాంట్రాక్టులన్నీ మేఘాకు కట్టబెట్టారు. మేఘా తీగ లాగితే తన అవినీతి డొంక కదులుతుందని మేఘా మీద ఈగ వాలకుండా కాపలా కాస్తున్నారు కేసీఆర్ గారు.” అంటూ ట్వీట్ చేశారు.
మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు, కేసీఆర్
అవినీతి సొమ్మంతా మేఘా కృష్ణారెడ్డి చేతుల్లో ఉంది. అందుకే మేఘా కంపెనీ పంపు హౌస్ లు మునిగినా, ప్రాణాలు తీసినా, గుట్టలు కొల్లగొట్టి మట్టిని ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించినా, రూల్స్ కు విరుద్ధంగా చేసిన బ్లాస్టింగ్ ల వల్లే పంపుహౌస్ లు 1/2— YS Sharmila (@realyssharmila) August 1, 2022