“ఆదిపురుష్” Update : రాముడిగా ప్రభాస్.. మరి సీత ఎవరో తెలుసా..!

‘బాహుబలి’ సినిమాతో ప్యాన్‌ ఇండియా స్టార్‌ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే చిత్రం చేస్తున్నాడు.. దాని తర్వాత నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ తన తర్వాత సినిమా గురించి ఇటీవలే చెప్పాడు. అదే “ఆదిపురుష్” ఓం రౌత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం అందరికి తెలిసందే.

టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దీన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో సీత ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు కీర్తిసురేష్ ఈ చిత్రంలో సీత పాత్రలో కనిపించబోతున్నారట. రాముడి అవతారమెత్తనున్న ప్రభాస్ కు మ్యాచ్ అవ్వాలంటే ఆ రేంజ్ హీరోయిన్ కీర్తిసురేష్ అని నిర్మాతలు భావిస్తున్నారట.