జైలు నుంచి కేజ్రీవాల్ పాలన షురూ.. తొలి ఉత్తర్వులు జారీ..!

-

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన తొలి అధికారిక ఉత్తర్వులు ఆదివారం జారీ చేసినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. జలవనరుల శాఖకు ఈ ఆర్డర్స్ జారీ చేసినట్టు సమాచారం. ఢిల్లీలో నీటి సరఫరాకు చెందిన ఈ ఆదేశాలు జలవనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపడుతున్న అతిశీకి ఓ నోట్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది.

ఇక కేజీవాల్ ని ఈ నెల 21 లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని అప్ స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి జైలుకు వెళ్లిన వ్యక్తి ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజీవాల్ తొలి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. ఐటీఓ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్ కి మద్దతుగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news