రేపు చంద్రగ్రహణం లేదని చెబుతున్నారు పండితులు. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కోరుతున్నారు. వాస్తావానికి ఈ చంద్రగ్రహణం మనదేశంలో పెద్దగా కనిపించదని చెబుతున్నారు శాస్త్రజ్ఞులు, పండితులు. కానీ జపాన్ యూరప్ అమెరికా దేశాలలో మాత్రం దీనిని మనం చూడవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్కృతులలో గ్రహానికి మరియు గర్భిణీ స్త్రీలకు మధ్య అనుబంధం ఉన్నట్లు చెప్పుకుంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచనలు చేస్తారు. కానీ మనదేశంలో రేపు చంద్రగ్రహణం లేకపోవడంతో ఎవరు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు పండితులు.