కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతోంది.. దీంతో ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావాలంటనే భయపడుతున్నారు. ప్రభుత్వాలు, సెలబ్రిటీలు కూడా ప్రజలు బయటకు రాకూడందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులు ప్రజలు బయటకు రాకుండా ఉండాలంటే వారి ఆదాయానికి చాలా నష్టం జరుగుతుంది. కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేరళ సీఎం పినరయ్ విజయన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంశలు అందుకుంటున్నాయి.
ప్రజలు ఇళ్ళలోంచి బయటకు రావొద్దని చెప్పడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఒక నెల రోజులు పాటు ఫ్రీరేషన్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీనితో పాటు రెండు నెలల పెన్షన్ డబ్బులు కూడా ఇస్తామన్నారు. వీటితో పాటు ఒక నెల కరెంట్ బిల్లు కట్టేందుకు ఎక్సెటెన్షన్ కూడా ప్రకటించారు. వీటన్నింటికీ కలిపి 2000 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.
ఇప్పటి వరకూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు జనం బయటకు రాకుండా ఉండాలని మాత్రమే చెప్పాయి. కానీ వారిని ఇళ్లకు పరిమితం చేసేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ కేరళ సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై దేశం మొత్తం ప్రశంశలు కురిపిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కట్టడికిి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.