ఏపీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులపై కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు రచిస్తోంది.
ఏయే శాఖల్లో వేకెన్సీలు ఉన్నాయోననే సమాచారాన్ని సేకరించిన ఏపీ ప్రభుత్వం… గ్రూప్-1 కింద 140 పోస్టులు, గ్రూప్-2 కింద 1082 పోస్టులున్నట్టు గుర్తించింది. 12 శాఖల పరిధిలో గ్రూప్-1 పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. హెచ్వోడీలతో పాటు మరో 10 శాఖల పరిధిలో గ్రూప్-2 పోస్టుల్లో వేకెన్సీలు ఉన్నాయని.. గుర్తించింది సర్కార్. ఇక వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయనుంది ఏపీ సర్కార్.